Hyderabad, ఏప్రిల్ 16 -- Priyadarshi: టాలీవుడ్ నటుడు ప్రియదర్శి ఇప్పుడు సారంగపాణి జాతకం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలుసు కదా. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ బుధవారం (ఏప్రిల్ 16) జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రియదర్శి.. తన మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న అలేఖ్య పచ్చళ్ల వివాదాన్ని వాడుకోవడంపై స్పందించాడు.

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం చేసుకునే ముగ్గురు అమ్మాయిలు ఈ మధ్య ఓ వాట్సాప్ చాట్ లో కస్టమర్ ను బూతులు తిట్టి తమ వ్యాపారాన్ని పోగొట్టుకున్న సంగతి తెలుసు కదా. ఈ వివాదం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. చాలా మంది ఈ పచ్చళ్ల వ్యాపారం నడిపే ముగ్గురు అమ్మాయిలను దారుణంగా ట్రోల్ చేశారు. సారంగపాణి జాతకం మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆ మూవీ టీమ్ కూడా ఈ వివాదాన్ని వాడుకుంది. అందులో ప్రియదర్శి క...