భారతదేశం, ఏప్రిల్ 5 -- కోర్ట్ చిత్రంతో ఇటీవలే మంచి హిట్ సాధించారు ప్రియదర్శి. ఆ మూవీలో తన నటనకు భారీగా ప్రశంసలు పొందారు. నాని నిర్మించిన ఆ లీగల్ డ్రామా చిత్రం సూపర్ హిట్ సాధించింది. ప్రియదర్శి హీరోగా నటించిన 'సారంగపాణి జాతకం' చిత్రం ఏప్రిల్ 18వ తేదీన విడుదల కానుంది. ప్రమోషన్లను మూవీ టీమ్ జోరుగా చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొంతకాలంగా రచ్చగా మారిన అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదాన్ని ప్రమోషన్లను వాడేసుకున్నారు ప్రియదర్శి.

ప్రియదర్శి, హీరోయిన్ రూప కడవయూర్ తాజాగా ఓ వీడియో చేశారు. ప్రియదర్శి బుక్ చదువుతూ ఉంటే.. మొబైల్‍లో ఓ డ్రెస్ చూపిస్తుంది ప్రియ. రూ.14,999ఆ.. చాలా ఎక్స్‌పెన్సివ్ అని ప్రియదర్శి అంటారు.

"నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టాలమ్మా.. అర్థమవుతుందా. రేపు నీ పెళ్లామో, గర్ల్ ఫ్రెండో డ్రెస్ చూపించినప్పుడు ఎక్స్‌పెన్సివ్ అన్నావనుకో.. ...