భారతదేశం, మార్చి 16 -- Private College Principal : శ్రీస‌త్యసాయి జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించాడు. విద్యా బుద్ధులు నేర్పి, ఉన్నత శిఖ‌రాల‌ను అధిరోహించేందుకు బాట‌లు వేయాల్సిన ప్రిన్సిపాల్ విద్యార్థినిల ప‌ట్ల వికృతంగా ప్రవ‌ర్తించాడు. హోలీ సంద‌ర్భంగా కాలేజీకి సెల‌వు అయిన‌ప్పటికీ, స్పెష‌ల్ క్లాస్ పేరుతో విద్యార్థినీల‌ను కాలేజీకి ప్రిన్సిపాల్ ర‌మ్మన్నారు. దీంతో ప్రిన్సిప‌ల్ ఆదేశాల మేర‌కు విద్యార్థినిలు కాలేజీకి వెళ్లారు. అయితే అక్కడ స్పెష‌ల్ క్లాస్ కాకుండా, హోలీ ఆట‌ను ప్రిన్సిపాల్ మొద‌లుపెట్టాడు. ఈ క్రమంలో విద్యార్థినుల ప‌ట్ల అస‌భ్యకరంగా ప్రవ‌ర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ అయింది. కానిస్టేబుల్ ఫిర్యాదుతో ప్రిన్సిపాల్‌పై కేసు న‌మోదు అయింది.

ఈ ఘ‌ట‌న శ్రీస‌త్యసాయి జిల్లాలో క‌దిరి ప‌ట్టణంలో చోటుచేసుకుంది. ...