Hyderabad, మార్చి 24 -- Prithviraj Sukumaran About L2 Empuraan Budget And Remuneration: సలార్ విలన్, మలయాళ హీరో, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన మరో సినిమా ఎల్2 ఎంపురాన్. ఇదివరకు పృథ్వీరాజ్ డైరెక్ట్ చేసిన లూసిఫర్ మూవీకి ఇది సీక్వెల్.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా చేసిన ఎల్2 ఎంపురాన్ మార్చి 27న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. "మా కోసం వచ్చిన దిల్ రాజు గారికి థాంక్స్. తెలుగులో మా సినిమాను రిలీజ్ చేస్తున్న ఆయనకు చాలా థాంక్స్" అని అన్నారు.

"ఇలాంటి సినిమాను మేం ఎప్పుడూ ట్రై చేయలేదు. ఒరిజినల్ వర్షెన్‌లానే తెలుగు వర్షెన్ ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కోసం చాలా కష్టపడ్డాం. చాలా అథంటిక్‌గా ఉండాలని ప్రయత్నించాం. తెలుగు ప్రేక్షకులు తెలుగు వర్షెన్‌లో చూస్తే.. ...