Hyderabad, మార్చి 22 -- Prithviraj Sukumaran About L2 Empuraan Distribution: హీరోగా, నటుడిగా, దర్శకుడిగా సత్తా చాటుతున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ సలార్ మూవీలో విలన్ వరద రాజమన్నార్ పాత్రలో అదరగొట్టిన పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయ్యాడు.

ది గోట్ లైఫ్ సినిమాతో నటుడిగా తానేంటో నిరూపించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. హీరోగా, నటుడిగానే కాకుండా డైరెక్టర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. 2019లో వచ్చిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లూసిఫర్ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా రెండో పార్ట్‌గా ఎల్2 ఎంపురాన్ సినిమా రానుంది.

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్-పృథ్వీరాజ్ సుకుమారన కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఎల్2 ఎంపురాన్ సినిమాను మార్చి 27న వరల్డ్ వైడ్‌గా మలయాళంతోపాటు తెలు...