Hyderabad, ఫిబ్రవరి 4 -- Prime Video Releases this week: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వారం మిస్ కాకుండా చూడాల్సిన కొన్ని మూవీస్ ఉన్నాయి. వాటిలో గేమ్ ఛేంజర్, ది మెహతా బాయ్స్, బ్యాగ్‌మ్యాన్, యు ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ లాంటివి ఉండటం విశేషం. మరి వీటిలో ఏ మూవీ ఎప్పుడు ప్రైమ్ వీడియోలోకి అడుగు పెట్టనుందో ఒకసారి చూద్దాం.

ప్రైమ్ వీడియోలో ఈ వారం ఎంతో ఆసక్తి రేపుతున్న మూవీ గేమ్ ఛేంజర్ అనడంలో సందేహం లేదు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియోనే మంగళవారం (ఫిబ్రవరి 4) వెల్లడించింది.

వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 7) నుంచి గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో సినిమాకు దారుణమైన కలెక్షన్లు వచ్చినా.. ఓటీటీలో మాత్రం కాస్త మెరుగైన రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రామ్ చరణ్, క...