Hyderabad, ఫిబ్రవరి 4 -- ఈ రోజుల్లో ప్రెషర్ కుక్కర్ ఉపయోగించని ఇళ్లు లేదంటే అతిశయోక్తి కాదు. స్కూళ్లకు, ఆఫీసులకు లంచ్ బాక్సులు రెడీ చేయడానికి నేటి గృహిణులు ప్రెషర్ కుక్కర్‌ను విపరీతంగా వాడేస్తున్నారు. ఇది కేవలం సమయాన్నే కాదు గ్యాస్ ను ఆదా చేస్తుంది కదా అనుకుని అన్నం నుంచి ఆలు వరకూ అన్నింటినీ కుక్కర్లో వేసిసి వండేస్తున్నారు. కానీ ఇది సరైన పద్ధతి కాదంటున్నారు ఆహార నిపుణులు. కొన్ని రకాల ఆహార పదార్థాలను కుక్కర్లో వేసి వండటం వల్ల వాటి రుచితో పాటు ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు కూడా దెబ్బతింటాయట. మీరు ఎంత బిజీగా ఉన్న ప్రెషర్ కుక్కర్లో వండకూడని ఆహారాలేంటో తెలుసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

శనగలు, బఠానీలు, చిక్కుళ్లు, బీన్స్ వంటివి ఉడకడానికి కాస్త ఎక్కువ సయమం తీసుకుంటాయి. పైగా కూర అడుగంట కుండా ఉంటడేందుకు వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అ...