Hyderabad, ఏప్రిల్ 28 -- Shankar Premikudu Re Release: మెగా ప్రొడ్యూసర్ కే టి కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన సినిమా ప్రేమికుడు. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవ, అందాల నటి నగ్మ నటించిన ఈ ప్రేమికుడు సినిమా రీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్ నిర్మాతలుగా రమణ, మురళీధర్ వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు.

30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ మే 1న 300కు పైగా థియేటర్లలో ఘనంగా రీ రిలీజ్ అవుతోంది. బుకింగ్స్ ఓపెన్ అయి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. గేమ్ చేంజర్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా జంటగా 30 సంవత్సరా...