భారతదేశం, ఏప్రిల్ 13 -- Premalu Review: ప్రేమ‌లు...ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తోంది. థియేట‌ర్ల‌లో కాసుల వ‌ర్షం కురిపించిన ఈ మ‌ల‌యాళం మూవీ తెలుగు వెర్ష‌న్ ఆహా ఓటీటీలో రిలీజైంది. ప్రేమ‌లు మూవీలో న‌స్లేన్ కే గ‌ఫూర్‌, మ‌మితా బైజు హీరోహీరోయిన్లుగా న‌టించాడు. యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు గిరీష్ ఏడీ ఈ మూవీని తెర‌కెక్కించాడు. ప్రేమ‌లు మూవీ ఎలా ఉందంటే?

స‌చిన్ (న‌స్లేన్ కే గ‌ఫూర్‌) జీవితాన్ని జాలీగా గ‌డ‌పాల‌ని క‌ల‌లుక‌నే న‌వ‌త‌రం కుర్రాడు. అంజ‌లి అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. కాలేజీ చివ‌రి రోజు త‌న ప్రేమ‌ను ఆమెకు చెబుతాడు. తాను మ‌రొక‌రితో ప్రేమ‌లో ఉన్న‌ట్లు చెప్పిన అంజ‌లి అత‌డికి హ్యాండిచ్చి వెళ్లిపోతుంది. ఆ ల‌వ్ బ్రేక‌ప్ బాధ‌లో ఉండ‌గానే అత‌డి యూకే వీసా రిజెక్ట్ అవుతోంది. ఇంట్లో వాళ్ల పోరుప‌డ‌ల...