భారతదేశం, మార్చి 1 -- Premaku Jai Movie: తెలుగు సీరియ‌ల్ యాక్ట‌ర్ అనిల్ బూర‌గాని హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. ప్రేమ‌కు జై పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. విలేజ్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధ‌మైంది. ఆర్ జ్వ‌లిత హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకు శ్రీనివాస్ మ‌ల్లం ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇటీవ‌ల ప్రేమ‌కు జై మూవీ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు.

ఈ మూవీలో అనిల్ బూర‌గాని చిరంజీవి అభిమానిగా క‌నిపిస్తున్నాడు. సినిమాల్లో హీరోగా న‌టించాల‌నే ఓ యువ‌కుడు ఎలా ప్రేమ‌లో ప‌డ్డాడు? స‌ర్పంచ్ కూతురితో అత‌డి ప్రేమాయ‌ణం ఎలాంటి మ‌లుపులు తిరిగింది? వారి ప్రేమ‌కు ఆస్తులు, అంత‌స్తులు ఎలా అడ్డుగోడ‌లుగా నిలిచాయ‌నే పాయింట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్లు టీజ‌ర్‌లో చూపించారు.

ప్రేమ‌కు జై సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌లో డై...