భారతదేశం, ఏప్రిల్ 14 -- Pregnant Woman Murder : మరో 24 గంటల్లో ప్రసవం, పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన ఆ యువతి విగతజీవిగా మారింది. నిండు గర్భిణీ అని కూడా చూడకుండా భర్త రూపంలో ఉన్న మృగాడు అతిదారుణంగా ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన విశాఖ మధురవాడలో చోటుచేసుకుంది.

విశాఖ పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న గెద్దాడ జ్ఞానేశ్వరరావు, అనూష రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ ఒంటరిగా మధురవాడ పీఎంపాలెంలోని ఊడా కాలనీలో నివాసం ఉంటున్నారు. స్కౌట్స్, సాగర్ నగర్ వ్యూ పాయింట్ వద్ద జ్ఞానేశ్వర్ రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అనూష గర్భం దాల్చింది. ఆమెకు నెలలు నిండాయి. మరో 24 గంటల్లో డెలివరీ అవుతుందని వైద్యులు తెలిపారు.

గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయి. సోమవారం ఉదయం వీరి మధ్య...