Hyderabad, ఫిబ్రవరి 25 -- గర్భం ధరించారో లేదో తెలుసుకోవడానికి ప్రతి మహిళ మొదట ఇంట్లోనే ప్రెగ్నెన్సీ కిట్లను వాడుతుంది. అందులో పాజిటివ్ గా ఫలితం వస్తే వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకుంటుంది. వైద్యుడు రక్త పరీక్ష చేయించడం ద్వారా గర్భధారణను నిర్ణయిస్తాడు. అయితే మొదట ఇంట్లో చేసే ప్రెగ్నెన్సీ కిట్లు... కేవలం రెండు చుక్కల యూరిన్‌తో గర్భధారణను ఎలా నిర్ణయిస్తుంది. ఈ సందేహం ఎంతో మందిలో ఉంది.

గర్భధారణ జరిగాక ఆ మహిళ శరీరంలో హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్ అంటే హెచ్‌సిజి అనే హార్మోను ఏర్పడుతుంది. గర్భం ధరించిన ఆరు రోజుల తర్వాత ఇది యూరిన్ లో కనిపించడం ప్రారంభమవుతుంది.

ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కిట్ పై రెండు చుక్కల యూరిన్ ను వేస్తారో అప్పుడు అందులో ఉన్న హెచ్‌సీజీని ఆ ప్రెగ్నెన్సీ కిట్ గుర్తించడం ప్రారంభిస్తుంది. హెచ్‌సిజి ఉనికి కనిపెట్టగా...