Hyderabad, జనవరి 26 -- ప్రసవానంతరం లేదా గర్భధారణ సమయంలో మతిమరుపు, నిరాశ వంటి సమస్యలు చాలా మంది మహిళలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇది నిజంగానే జరుగుతుందా లేదా మహిళలు అనవసరంగా ఆందోళన చెందుతున్నారా అనే సందేహం చాలా మందిలో ఉంది. దీనికి సమాధానం కోసం స్పెయిన్‌లో ఓ పరిశోధనా బృందం దీని గురించి లోతుగా స్టడీ చేసింది. వారి పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే.. గర్భధారణ అనేది మహిళల మెదడును ప్రభావితం చేస్తుందట. దీని వల్ల అనేక మార్పులు సంభవిస్తాయని వెల్లడైంది. గర్భధారణ సమయంలో, తర్వాత సంభవించే మెదడు సంబంధిత సమస్యల గురించి వివరంగా తెలుసుకుందాం రండి.

గర్భధారణ, ప్రసవ సమయంలో మహిళల్లో అనేక శారీరక మార్పులు సంభవిస్తాయి. కానీ ఈ మార్పులు కేవలం శారీరకమైనవి మాత్రమే కాదు, వీటికి మెదడుతో కచ్చితంగా సంబంధం ఉంటుంది. నేచర్ కమ్యూనికేషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, గర్భధారణ చి...