Hyderabad, ఫిబ్రవరి 10 -- ప్రెగ్నెన్సీ అనేది స్త్రీ జీవితంలో ఎంతో సంతోషకరమైన సందర్భం. ఆ విషయాన్ని ఆమె ఎంతో ఆనందంగా బయటికి చెప్పాలని అనుకుంటారు. అయితే ఇంట్లోని అమ్మమ్మలు, నాన్నమ్మలు మాత్రం ప్రెగ్నెన్సీ విషయాన్ని వెంటనే బయటకి చెప్పనివ్వరు. గర్భం వయసు మూడు నెలలు దాటాకే అందరికీ చెప్పేందుకు అనుమతిస్తారు.

ఇప్పుడు మహిళలు చాలా ఆలస్యంగా కుటుంబాన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక మహిళ గర్భం దాల్చినప్పుడు, కనీసం మూడు నెలల వరకు గర్భం గురించి ఎవరికీ చెప్పవద్దని ఎంతో మంది సలహాలు ఇస్తారు. అటువంటి పరిస్థితిలో, గర్భధారణ శుభవార్తను మూడు నెలలపాటు ఎందుకు దాచమని చెబుతారో పెద్దలు వివరిస్తున్నారు.

గర్భం ధరించాక మొదటి త్రైమాసికం అంటే గర్భం దాల్చిన తరువాత మొదటి మూడు నెలలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో తల్లి పొట్టలో ఉన్న బిడ్డకు సంబంధించిన ప్రధాన అవయవాలన్నీ ఏర్పడతాయి. ద...