Hyderabad, మార్చి 3 -- డయాబెటిస్ ప్రాణాంతక వ్యాధి అని చెప్పలేం కానీ, కొంచెంకొంచెంగా మనిషిని బలహీనపరిచి గందరగోళానికి గురి చేస్తుంది. ప్రస్తుత జనరేషన్‌లో ఈ మధుమేహం అనేది కామన్‌గా మారిపోయింది. అనుకోకుండా తరచూ అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో టెస్ట్ చేయించుకుంటే కానీ తెలుసుకోలేకపోతున్నాం. అప్పటికే మనలో డయాబెటిక్ లెవల్స్ పెరిగిపోయి, దాన్ని రోజూ పెంచి పోషించాల్సిన పరిస్థితి వస్తుంది. పూర్తిగా మన లైఫ్‌స్టైల్‌ను మార్చేస్తుంది కూడా.

డయాబెటిస్ వల్ల రక్తప్రసరణ వ్యవస్థలో షుగర్ అనేది చిన్న చిన్న రక్త కణాలుగా మారి కలిసిపోయి ఉంటుంది. ఫలితంగ అవయవాల పనితీరును క్రమంగా దెబ్బతీస్తుంది. అందుకే దీనిని ముందుగానే గుర్తిస్తే, అవయవాలను కాస్త ఎక్కువ కాలం పాటు కాపాడుకోవచ్చు.

బ్లడ్ షుగర్ లెవల్స్ సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండటాన్ని ప్రీ డయాబెటిస్ అంటారు. ఇది టైప్-2...