భారతదేశం, ఏప్రిల్ 1 -- పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై పోలీసుల దర్యాప్తు కొలిక్కి వచ్చింది. మార్చి 24న హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్లే వరకు సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంటర్ అయిన తరువాత ప్రవీణ్ బైక్ రెండు సార్లు ప్రమాదానికి గురైంది. ప్రమాదం తరువాత కూడా బైక్ డ్రైవ్ చేసుకుంటూ పాస్టర్ ప్రవీణ్ రాజమండ్రి వైపు ప్రయాణం సాగించారు.

విజయవాడలో 3 గంటల పాటు ప్రవీణ్ ఎక్కడ ఉన్నారనే దానిపై పోలీసులకు స్పష్టత వచ్చింది. దాదాపు 3 గంటలు రామవరప్పాడు రింగ్ రోడ్డు దగ్గరే ఆయన గడిపినట్టు తెలుస్తోంది. రామవరప్పాడు రింగ్ రోడ్డు సమీపంలో ప్రవీణ్ రోడ్డుపై పడిపోయారని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు వద్దని చెప్పినా అక్కడి నుంచి వెళ్లిపోయారు. గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద ఇంధనం కొట్టించుకుని.. ప్రవీణ్ సిటీ వైపు వెళ్లినట్టు ప...