భారతదేశం, ఏప్రిల్ 2 -- Pastor Praveen Pagadala : హైదరాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమహేంద్రవరం సమీపంలో అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ కేసులో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై బయలుదేరిన ఆయన రాజమండ్రి సమీపంలో రోడ్డు పక్కన విగతజీవిగా పడిఉన్నారు. రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం పలువురి నుంచి అనుమానాలు వ్యక్తం కావడంతో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే మార్గంలో ప్రవీణ్ పగడాల ఎక్కడెక్కడ ఆగారు...ప్రయాణానికి సంబంధించిన సీసీ ఫుటేజీలు కీలకంగా మారాయి. ప్రయాణ మార్గంలో ఆయన పలుమార్లు ప్రమాదానికి గురయ్యారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు ముగి...