భారతదేశం, ఏప్రిల్ 2 -- Praveen Pagadala : పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై పోలీసుల దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. అయితే సోషల్ మీడియాలో ప్రవీణ్ పగడాల మృతిపై వివిధ కోణాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రవీణ్ భార్య జెస్సికా, సోదరుడు కిరణ్ లు వీడియోలు విడుదల చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు.

"ఈ దర్యాప్తు సమయంలో మీ సహకారం కోరుకుంటున్నాను. ప్రవీణ్ మరణంపై పూర్తి దర్యాప్తు జరిపాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దర్యాప్తు జరుగుతున్న సందర్భంగా అందరికీ విజ్ఞప్తి...కొందరు ప్రవీణ్ మరణంపై స్వయంగా దర్యాప్తు చేస్తున్నారు. దయచేసి సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ ను నిలిపివేయండి. ఎందుకంటే ఇది ప్రవీణ్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదం ఉంది. కొంతమంది యూట్యూబర్లు , బ్లాగర్లు అతని మరణంపై తప్పుడు సమాచారాన్...