Hyderabad, ఏప్రిల్ 22 -- Pravasthi vs Singer Sunitha: పాడుతా తీయగా ప్రోగ్రామ్ కంటెస్టెంట్ ప్రవస్తి.. ఆ షో జడ్జి అయిన సింగర్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్ పై చేసిన ఆరోపణలు సంచలనం రేపిన విషయం తెలుసు కదా. వీటిపై తాజాగా సునీత స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో ఓ సుదీర్ఘ వీడియో పోస్ట్ చేసింది. అందులో ప్రవస్తికి కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. గెలిస్తే కాళ్లు మొక్కి, ఓడినప్పుడు తిట్టడం సరికాదని ఆమెకు క్లాస్ పీకింది.

సింగర్ ప్రవస్తికి సునీత తన వీడియోలో ఘాటు రిప్లై ఇచ్చింది. తనని చిన్నతనం నుంచి బాలుగారు, జానకిగారు, చిత్రమ్మ, తను ఒళ్లో కూర్చోబెట్టుకొని పాటలు నేర్పామని, ఇప్పుడు 19 ఏళ్ల వయసులో ఆమెను ఒళ్లో కూర్చోబెట్టుకుంటే బాగుండదు కదా అని ఆమె అన్నది. ఈటీవీ, పాడుతా తీయగా, జ్ఞాపిక ప్రొడక్షన్స్ అంటూ నిన్నంతా వార్తలు రా...