భారతదేశం, ఏప్రిల్ 17 -- Prasanth Varma: హ‌నుమాన్‌తో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్నాడు టాలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ శ‌ర్మ‌. కేవ‌లం న‌ల‌భై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ తెలుగు మూవీ 330 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి స‌త్తాచాటింది. భ‌క్తి ఎలిమెంట్‌కు సూప‌ర్ హీరో పాయింట్‌ను జోడించి ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కించారు. హ‌నుమాన్‌లో ప్ర‌శాంత్ వ‌ర్మ టేకింగ్‌,మేకింగ్‌తో పాటు తేజా స‌జ్జా యాక్ష‌న్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

హ‌నుమాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో సినిమాలు చేసేందుకు ప‌లువురు స్టార్ హీరోలు సిద్ధ‌మ‌వుతోన్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్ నుంచి ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు ఆఫ‌ర్లు క్యూ క‌డుతోన్నాయి. తాజాగా ప్ర‌శాంత్ వ‌ర్మ బాలీవుడ్ నుంచి బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ట్లు వార...