భారతదేశం, మార్చి 10 -- Pranay Murder Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచల తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ2 గా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. తన కూతురు అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో...అమృత తండ్రి మారుతీరావు 2018 సెప్టెంబర్ 14 సుపారీ గ్యాంగ్ తో ప్రణయ్ ను హత్య చేయించాడు. సుమారు ఐదేళ్ల పాటు సాగిన విచారణ అనంతరం తాజాగా నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేసు విచారణలో ఉండగానే అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు.

నల్గొండ కోర్టు సంచలన తీర్పుతో ప్రణయ్-అమృత ప్రేమ, పెళ్లి, పరువు హత్య మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. ఈ పరువు హత్య తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో తన భర్త హత్య కేస...