భారతదేశం, మార్చి 11 -- ప్రణయ్ హత్య కేసులో తీర్పు రాకముందే ప్రధాన సూత్రధారి.. ఏ1 మారుతీరావు సూసైడ్ చేసుకున్నారు. ఈ కేసులో తాజాగా తీర్పు వెలువరించిన నల్గొండ ఎస్సీ, ఎస్సీ కోర్టు.. హంతకుడు ఏ2 సుభాష్‌శర్మకు ఉరి శిక్ష విధించింది. దీంతో అసలు సుభాష్‌శర్మకు ఈ కేసుతో సంబంధం ఏంటి.. అతను ప్రణయ్‌ను ఎందుకు చంపాల్సి వచ్చిందనే చర్చ జరుగుతోంది.

ఉరి శిక్ష పడిన సుభాష్‌శర్మది బీహార్ రాష్ట్రం సమస్థిపూర్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతం. అతని కుటుంబం చిన్న గూడెంలో నివసించేది. ఈ హత్య జరిగిన తర్వాత సుభాష్‌శర్మ అతని సొంతూరుకు వెళ్లారు. ఈ కేసు దర్యాప్తును అప్పటి ఐజీ స్టీఫెన్ రవీంద్ర, నల్గొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్.. నల్గొండ టూ టౌన్ అప్పటి సీఐ బాషా, మెదక్ ఎస్సై శివకుమార్‌కు అప్పగించారు. బాషాకు అప్పటికే ఎన్ఐఏలో పని చేసిన అనుభవం ఉంది.

అనుభవం ఉన్న బాషాను రంగనాథ్ బీహార...