ఆంధ్రప్రదేశ్,ప్రకాశం జిల్లా, మార్చి 6 -- రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా ప్ర‌కాశం జిల్లా ఒంగోలు మెడిక‌ల్ కాలేజీ, జ‌న‌ర‌ల్ హాస్ప‌ట‌ల్‌, ప్ర‌భుత్వ న‌ర్సింగ్ కాలేజీ, ప్ర‌భుత్వ న‌ర్సింగ్ స్కూల్‌లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 43 పోస్టులు ఉండగా. దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 20వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భ‌ర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 43 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ప్ర‌భుత్వ వైద్య కళాశాలలో 2, జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రిలో 24, ప్ర‌భుత్వ న‌ర్సింగ్ కాలేజీలో 7, స్కూల్ ఆఫ్ న‌ర్సింగ్‌లో 10 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 4 పోస్టుల‌ను కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలోనూ, 39 పోస్టుల‌ను ఔట్ సోర్సింగ్ ప‌ద్ద‌తిలోనూ భ‌ర్తీ చేయనున్నట్లు నోటి...