ఆంధ్రప్రదేశ్,ప్రకాశం జిల్లా, ఫిబ్రవరి 15 -- ప్ర‌కాశం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పాఠ‌శాల వంట మనిషిపై ఉపాధ్యాయుడు అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. దీంతో గ్రామ‌స్తులకు విష‌యం తెలిసి ఉపాధ్యాయుడిని స్తంభానికి క‌ట్టేసి దేహ‌శుద్ధి చేశారు. అనంత‌రం ఆ ఉపాధ్యాయుడిని గ్రామ‌స్తులు పోలీసుల‌కు అప్ప‌గించారు. మండ‌ల విద్యా శాఖ అధికారి (ఎంఈవో) వ‌స్త్రాం నాయ‌క్ పాఠ‌శాల‌ను సంద‌ర్శించి వివ‌రాలు సేక‌రించారు.

ఈ ఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లా కురిచేడు మండలం పడమర నాయుడుపాలెం పంచాయతీలోని వీవై కాలనీలో ఒక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్ర‌కారం.. వేముల వెంకట రవికుమార్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అదే పాఠ‌శాల‌లో ఒక మ‌హిళ మ‌ధ్యాహ్న భోజ‌నం ప‌థ‌కంలో భాగంగా వంట చేస్తోంది. ఆ మ‌హిళ‌, మ‌రో మ‌హి...