భారతదేశం, ఫిబ్రవరి 14 -- Prakasam Crime : హైదరాబాద్ లోని మీర్ పేట్ లో భార్యను చంపి ముక్కలుగా చేసిన ఘటన మురువగా ముందే ఏపీలో మరో దారుణం వెలుగుచూసింది. ప్రకాశం జిల్లా కంభంలోని తెలుగు వీధిలో కన్న కొడుకును తల్లి ఓ ఆటో డ్రైవర్ సాయంతో హత్య చేసింది. హత్య తరువాత శరీర భాగాలను ముక్కలుగా నరికి మూడు గోనెసంచుల్లో కుక్కి మేదర బజారు సమీపంలోని పంట కాలువలో పడేశారు. గోనె సంచుల్లో శరీర భాగాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది.

ప్రకాశం జిల్లా కంభంలోని తెలుగు వీధిలో కదం శ్యామ్(35) అతి దారుణంగా హత్యకు గురయ్యాడు. శ్యామ్ శరీరాన్ని ముక్కలు నరికారు. శరీరాన్ని ముక్కలుగా చేసి మూడు గోనె సంచుల్లో కుక్కి మేదర బజార్ సమీపంలోని పంట కాలువ పడేశారు. ఈ ఘటనలో కన్న తల్లి సాలమ్మ హత్య చేసిందని శ్యామ్ సోదరుడు సుబ్రహ్మణ్యం ఆరోపణలు చేశాడ...