భారతదేశం, ఏప్రిల్ 29 -- Prajwal Revanna : 2024 లోక్​సభ ఎన్నికల మధ్య.. కర్ణాటకను సెక్స్​ కుంభకోణం కుదిపేస్తోంది. ఎన్నికల వేళ బీజేపీ పొత్తు కుదుర్చుకున్న జేడీఎస్​కు చెందిన హసన్​ ఎంపీ, మాజీ ప్రధానమంత్రి మంత్రి హెచ్​డీ దేవేగౌడ మనవడు.. ప్రజ్వల్​ రేవన్నపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఓ మహిళను ఆయన చాలా కాలం పాటు లైంగికంగా హింసించాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన అశ్లీల దృశ్యాలు.. హసన్​ జిల్లాలో సర్క్యులేట్​ అవుతున్నాయి.

మాజీ ప్రధాని, జేడీఎస్​ నేత హెచ్​డీ దేవే గౌడ మనవడు ఈ ప్రజ్వల్​ రేవన్న. ఈయన దేవేగౌడ కుమారుడు హెచ్​డీ రేవన్న కుమారుడు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి.. రేవన్నకు బాబాయ్​ వరుస అవుతారు. ప్రస్తుతం.. ఎంపీ ప్రజ్వల్​ రేవన్న.. హసన్​​ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. 2024 లోక్​సభ ఎన్నికల రెం...