Hyderabad, ఫిబ్రవరి 18 -- Pradeep Ranganathan In Return Of The Dragon Pre Release Event: కోమలి సినిమాతో డైరెక్టర్‌గా క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే మూవీలో హీరోగా చేసి మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా చేస్తున్న సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేస్తోంది.

అనుపమతోపాటు కాయదు లోహర్ మరో హీరోయిన్‌గా చేస్తోంది. ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా తెలుగులో కూడా థియేటర్లలో విడుదల కానుంది రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ. ఈ నేపథ్యంలో ఇటీవల ఆదివారం (ఫిబ్రవరి 16) డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ తెలుగులో మాట్లాడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

"లవ్ టుడే సమయంలో ఇక్కడకు వచ్చినప్పుడు అందరికీ మాట ఇచ్చా. నెక్ట్స్ టైం ఇక్కడకు వచ్చినప్పుడు ...