Hyderabad, ఫిబ్రవరి 23 -- ఉపవాసం అనేది శరీరానికి చాలా మేలు చేస్తుంది. మరి కొద్ది రోజుల్లో రానున్న శివరాత్రి, ముస్లింల పవిత్ర పండగైన రంజాన్ ఉపవాస దీక్షలతోనే జరుగుతాయి. వీరే కాదు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వాళ్లు కూడా అప్పుడప్పుడు ఉపవాసం ఉంటే శరీరానికి ప్రయోజనం కలుగుతుందని భావిస్తారు. వాస్తవానికి ఉపవాసం ఉండే సమయంలో శరీరంలో ఉండే కొవ్వు కరిగి గ్లూకోజ్‌గా మారుతుందట. దీని వల్ల బరువు తగ్గడంతో పాటు జీర్ణక్రియ మెరుగవుతుందని నిపుణుల అభిప్రాయం. కణాల డ్యామేజ్‌ను వాటంతట అవే రిపేర్ చేసుకునేందుకు తోడ్పడుతుందట. ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గించి టైప్ 2 డయాబెటిస్ రాకుండా చేస్తుంది.

అంతేకాకుండా ఇన్‌ఫ్లమ్మేషన్ తగ్గి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అదుపులో ఉంటుందట. ఉపవాసం ఉండటం వల్ల క్లారిటీతో పాటు ఫోకస్ మెరుగవుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ స్థిరంగా ఉండి కీటోన్స్ ఉత్ప...