భారతదేశం, ఫిబ్రవరి 13 -- ప్ర‌భాస్, డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి కాంబోలో తెర‌కెక్కుతోన్న మూవీలో బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమాలో న‌టిస్తోన్న విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా అనుప‌మ్ ఖేర్ ప్ర‌క‌టించాడు. న‌టుడిగా ఇది త‌న‌కు 544వ సినిమా అని అనుప‌మ్ ఖేర్ చెప్పాడు. ఇండియ‌న్ బాహుబ‌లి ప్ర‌భాస్‌, టాలెలెండ్ డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి కాంబోలో వ‌స్తోన్న సినిమాలో తాను న‌టిస్తోన్న‌ట్లు ఓ ట్వీట్ చేశాడు. ప్ర‌భాస్‌, హ‌ను రాఘ‌వ‌పూడిల‌తో క‌లిసి దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

ప్ర‌భాస్ మూవీ సెట్స్‌లోకి హ‌ను రాఘ‌వ‌పూడి ఎంట్రీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. 1940 కాలాన్ని త‌ల‌పించేలా భారీ వ్య‌యంతో ఈ సినిమా కోసం కొన్ని స్పెష‌ల్ సెట్స్ వేసిన‌ట్లు స‌మాచారం. ఈ సెట్స...