భారతదేశం, ఏప్రిల్ 17 -- Prabhas Kamal Haasan: ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న క‌ల్కి మూవీలో క‌మ‌ల్‌హాస‌న్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఈ సూప‌ర్ హీరో మూవీలో ప్ర‌భాస్ హీరోయిజానికి ధీటుగా క‌మ‌ల్ విల‌నిజం ఉంటుంద‌ని అంటున్నారు. దాదాపు ఆరు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఈ మూవీని తెర‌కెక్కిస్తోన్నాడు.భార‌తీయ‌ భాష‌ల‌తో పాటు ఇంగ్లీష్‌లోనూ క‌ల్కి మూవీ రిలీజ్ కాబోతోంది. మే9న క‌ల్కి 2898 ఏడీని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే ఈ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

కాగా క‌ల్కి కంటే ముందు క‌మ‌ల్‌హాస‌న్‌, ప్ర‌భాస్ క‌లిసి ఓ పాన్ ఇండియ‌న్ సినిమా చేయాల‌ని అనుకున్నారు. కానీ కాంట్ర‌వ‌ర్షీయ‌ల్ స్టోరీ కావ‌డంతో ఈ మూవీని నిర్మించ‌డానికి ప్రొడ్యూస‌ర్లు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో సినిమా ఆగ...