భారతదేశం, మార్చి 1 -- పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం 'ది రాజాసాబ్‍'తో పాటు హను రాఘవపూడితో ఓ మూవీ చేస్తున్నారు. స్పిరిట్, సలార్ 2, కల్కి 2 కూడా లైనప్‍లో ఉన్నాయి. కాగా, హనుమాన్ చిత్రంతో భారీ సక్సెస్ సాధించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఓ మూవీకి కూడా ప్రభాస్ ఓకే చెప్పారు. భారీ బడ్జెట్‍తో పాన్ ఇండియా చిత్రంగా ఇది తెరకెక్కనుంది. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఫైనలైజ్ అయ్యారనే సమాచారం వెల్లడైంది.

ప్రశాంత్ వర్మ తెరకెక్కించే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటించనున్నారనే సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రం కోసం భాగ్యశ్రీకి లుక్ టెస్ట్ కూడా జరిగిందని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ కూడా లుక్ టెస్టులో పాల్గొన్నారట. మొత్తంగా భాగ్యశ్రీనే హీరోయిన్‍గా మేకర్స్ ...