భారతదేశం, మార్చి 20 -- PPF funds withdraw: వడ్డీ రేట్లు క్రమంగా పడిపోవడంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై (PPF) కొన్నేళ్లుగా ప్రజల ఆసక్తి తగ్గుతుంది. ప్రస్తుతం పీపీఎఫ్ డిపాజిట్లపై 7.1% వడ్డీ లభిస్తుంది. అదనంగా దీనితో పన్ను ప్రయోజనాలు, ప్రభుత్వ మద్దతుతో లభించే భద్రత, రుణ పెట్టుబడిగా స్థిరత్వం కారణంగా చాలా మంది పెట్టుబడిదారులు ఇప్పటికీ దీనిని ఇష్టపడతారు. పీపీఎఫ్ కు 15 ఏళ్ల మెచ్యూరిటీ ఉన్నప్పటికీ, మెచ్యూరిటీకి ముందే ఖాతా నుంచి నిధులను ఉపసంహరించుకునే వీలుంది. అయితే, దీనికి కొన్ని నిబంధనలు, షరతులు ఉన్నాయి.

పీపీఎఫ్ పై రుణానికి అర్హత పొందాలంటే ఖాతా తెరిచిన నాటి నుంచి ఆ ఆర్థిక సంవత్సరంతో పాటు మరుసటి ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు వేచి ఉండాలి. అంటే, మూడో ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే పీపీఎఫ్ పై రుణం తీసుకోవచ్చు. రుణం కోసం దరఖాస్తు చేసిన సంవత్సరం కన్నా...