భారతదేశం, మార్చి 6 -- Powergrid Jobs: కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహారత్న కంపెనీగా ఉన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో PowergridCorporation of India పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ Notification జారీ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న పవర్‌ గ్రిడ్‌ దేశ వ్యాప్తంగా అంతరాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థల నియంత్రణ, నిర్వహణ కార్యకలాపాలను చేపడుతుంది.

జాతీయ స్థాయిలో విద్యుత్ నియంత్రణ, సరఫరా, కార్యకలాపాల నిర్వహణ, ప్రణాళికలు, సమన్వయ బాధ్యతలు, విద్యుత్ పంపిణీ పర్యవేక్షణ, నియంత్రణలు చేపడుతుంది. పవర్ ట్రాన్స్‌మిషన్ వ్యాపారంలో మహారత్న కంపెనీగా గుర్తింపు పొందింది.

సదరన్ రీజియన్‌ 1 పరిధిలో టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం అనుభవజ్ఞులైన యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధ...