భారతదేశం, ఫిబ్రవరి 5 -- Poultry Industry: తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమకు అంతు చిక్కని వ్యాధి పీడిస్తోంది. గత కొన్ని వారాలుగా పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ఏటా డిసెంబర్‌-ఫిబ్రవరి మధ్య కాలంలో కోళ్లలో మరణాలు సహజంగా ఉండేవే అయినా ఈ ఏడాది వేల సంఖ్యలో కోళ్లు మరణించాయి. కోళ్లు ఎందుకు చనిపోతున్నాయో తెలియక పౌల్ట్రీ ఫామ్స్‌ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.

వైరస్‌ కారణాలను ఇప్పటి వరకు గుర్తించకపోవడంతో దీని తీవ్రత ఎంత ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాలో నాటు, బ్రాయిలర్‌ కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోయాయి. మొదట ఒక్క కోడికి వైరస్‌ సోకిందని గుర్తించిన సా యంత్రానికి అదే షెడ్డులో పెంచుతున్న మొత్తం కోళ్లు వైరస్‌కు గురవుతున్నాయి.

కార్తీక మాసం తర్వాత ధరలు పుంజుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వైరస్‌ వ్యాపించడంతో మళ్లీ నష్టాలు తప్పవని ఆందోళన చె...