భారతదేశం, జనవరి 31 -- తెలుగు పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ పోతుగ‌డ్డ ఈటీవీ విన్ ద్వారా నేరుగా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. పృథ్వీ దండ‌మూడి, విస్మ‌య‌శ్రీ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో ఆడుకాలం న‌రేన్‌, శ‌త్రు కీల‌క పాత్ర‌లు పోషించారు. ర‌క్ష వీర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పోతుగ‌డ్డ మూవీ ఎలా ఉందంటే?

గీత (విస్మ‌య శ్రీ), కృష్ణ (పృథ్వీ దండ‌మూడి) ప్రాణంగా ప్రేమించుకుంటారు. ప్రేమాభిమానాల కంటే ప‌రువే ముఖ్య‌మ‌ని భావించే తండ్రి త‌మ ప్రేమ‌కు ఒప్పుకోవ‌డ‌ని భావించిన గీత‌...కృష్ణ‌తో క‌లిసి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. తండ్రికి త‌న ప్రేమ విష‌యం తెలిసేలోపు ప్రియుడితో క‌లిసి రాష్ట్రం దాటేసి వెళ్లిపోవాల‌ని ప్లాన్ చేస్తుంది. క‌ర్నూల్ నుంచి రాయ‌చోటి వెళ్లే బ‌స్ ఎక్కుతారు.

ఈ ప్రేమ జంట ప్ర‌యాణిస్తోన్న బ‌స్‌పై ఎటాక్ చేసి అందులోనివారంద‌రిని చంపేయాల‌ని పోతు...