భారతదేశం, ఫిబ్రవరి 12 -- Pothole Free Roads: రాష్ట్రంలో ఎక్క‌డా కూడా త‌న‌కు గుంతలున్న ర‌హ‌దార్లు క‌నిపించకూడ‌ద‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌ను ఆదేశించారు. గ‌తంలో ర‌హ‌దార్లపైన ప్ర‌యాణించాలంటే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఉండేద‌ని, దాన్ని పోగొట్టి ఇప్పుడు మ‌న ప్ర‌భుత్వం ర‌హ‌దార్లను బాగు చేశామ‌ని, ఇప్పుడు రోడ్లు కాస్త అందంగా క‌నిపిస్తున్నాయ‌ని, ఇది సంతోష‌దాయ‌క‌మ‌న్నారు. అయితే ఇక్క‌డితోనే మ‌నం ఆగిపోకూడ‌దని సూచించారు.

మంత్రులు, కార్య‌ద‌ర్శుల స‌ద‌స్సులో భాగంగా రోడ్లు భ‌వ‌నాల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి కాంతిలాల్ దండే ఇచ్చిన ప్ర‌జంటేష‌న్ పైన సీఎం మాట్లాడారు. జాతీయ ర‌హ‌దార్ల‌పైన కూడా త‌నకు ఎక్క‌డా గుంత‌లు క‌నిపించ‌కూడ‌ద‌న్నారు. ర‌హ‌దార్లకు మ‌ర‌మ్మ‌త్తులు చేయ‌డం, రోడ్లు నిర్మించ‌డం ఒక్క‌టే కాద‌ని, వాటి నిర్వ‌హ‌ణ కూడా నిరంత‌రం స‌మ‌ర్...