Hyderabad, మార్చి 17 -- ఇంట్లో ఎప్పుడూ బంగాళదుంపలతో ఎన్నో రకాల జుట్టు సమస్యలను నయం చేసుకోవచ్చని మీకు తెలుసా? అవును ఆలూతో కేవలం మీకిష్టమైన కర్రీలు, బజ్జీలు, చిప్స్ వంటివి మాత్రమే కాదు హెయిర్ మాస్క్‌లు కూడా తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపల రసంతో చాలా రకాల జుట్టు సమస్యలకు చెక్ పెట్టచ్చు. దీని వల్ల వెంట్రుకలకు కలిగే లాభాలేంటి? ఆలూ రసంతో ఎలాంటి హెయిర్ మాస్క్‌లు తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం రండి..

ఆలూలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని రసాన్ని చర్మం, జుట్టుకు అప్లై చేసుకుంటే అది అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా ఆలూ రసంతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల వెంట్రుకల ఆరోగ్యం మెరుగువుతుంది. వాటిని మెరిసేలా, బలంగా చేస్తుంది. బంగాళాదుంపల్లో అధికంగా లభించే పోషకాలు జుట్టుకు తేమను అందిస్తాయి. పోషణను పెంచుతాయి. అలాగే కురులకు చక్కటి కండిషనర్...