Hyderabad, మార్చి 14 -- హోలీ అంటేనే రంగుల పండుగ. ఈరోజున ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సరదాగా ఆటలు, పాటలతో గడిపే సమయం ఎంతో సంతోషాన్నిస్తుంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఏడాది హెలీ పండుగ కోసం ఎదురుచూస్తుంటారు. సమస్య ఏంటంటే.. హోలీ సందర్భంగా రంగులతో, రంగు నీటిలో హోలీ ఆడుకుంటున్నంత సేపు ఎలాంటి బాధ, భయం ఉండవు. కానీ తర్వాత మాత్రం చర్మం, కురుల విషయంలో కొంత చింతించాల్సి వస్తుంది.

హోలీ రంగు చర్మ సమస్యలను పెంచుతాయి. నీటి రంగులు మాత్రమే కాదు, కొన్నిసార్లు హెర్బల్ పొడి రంగుల వల్ల కూడా చర్మం ఎండిపోతుంది. దీనివల్ల ముఖం మరుసటి రోజు వరకు గరుకుగా అనిపిస్తుంది. మీరు సరిగ్గా ఇదే సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఇక్కడ మీకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. హోలీ రంగుల కారణంగా పొడిబారిన మీ చర్మాన్ని మృదువుగా మార్చగల రెండు రకాల ఫేస్ ప్యాక్‌ల తయారీ విధానం, అప్లై చ...