భారతదేశం, మార్చి 12 -- Posani Remand : సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి మరో షాక్ తగిలింది. సీఐడీ పోలీసులు పోసానిని గుంటూరులోని జడ్జి ముందు హాజరుపర్చారు. ఈ క్రమంలో పోసాని బోరున విలపించారు. తన ఆరోగ్యం బాగాలేదని, రెండుసార్లు ఆపరేషన్‌ చేసి గుండెకు స్టంట్లు వేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు బెయిల్‌ రాకుంటే ఆత్మహత్యే శరణ్యమని జడ్జి ఎదుట పోసాని కన్నీటి పర్యంతం అయ్యారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.... పోసానికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ లపై గతంలో పోసాని కృష్ణమురళి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. పీటీ వారెంట్లతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తు్న్నారు. ...