భారతదేశం, ఫిబ్రవరి 28 -- Posani Remand: సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి రైల్వే కోడూరు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. పోసానిని రాజంపేట జైలుకు తరలించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌ రాయదుర్గంలోని మైహోం భుజా అపార్ట్‌మెంట్‌లో పోసానిని అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు ఓబులవారిపల్లెకు తరలించారు.

పోసాని కృష్ణ మురళిని గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు దాదాపు 9 గంటల పాటు విచారించారు. రాత్రి పది గంటల సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించి రైల్వే కోడూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఉదయం 5 గంటల వరకు ఇరు పక్షాల మధ్య వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు.

చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ సహా ప్రతిపక్ష నేతలను అసభ్యంగా దూషించిన కేసులో పోసానిపై ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. తన వ్యాఖ్యలతో...