భారతదేశం, ఫిబ్రవరి 27 -- పోసాని కృష్ణ మురళి అరెస్ట్‌ను ఖండించారు వైఎస్సార్సీపీ చీఫ్ వైఎస్‌ జగన్‌. పోసాని భార్యను ఫోన్‌లో పరామర్శించారు. కృష్ణ మురళి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఫిర్యాదుతో.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు రోజుల కిందట ఓ కేసు నమోదైంది. ఈ కేసులో ఏపీ పోలీసులు బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో పోసానిని అరెస్టు చేశారు.

ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు పోసాని కృష్ణ మురళిని తీసుకెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో.. పోలీస్ స్టేషన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం రైల్వే కోడూరు ఆసుపత్రికి తరలించనున్నారు. అక్కడి నుంచి నేరుగా రైల్వే కోడూరు కోర్టుకు తరలించే అవకాశం ఉంది. పోసాని అరెస్టుపై భిన్నాభిప్రాయాల...