భారతదేశం, ఫిబ్రవరి 26 -- ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్‌ అయ్యారు . హైదరాబాద్‌లోని పోసాని కృష్ణమురళి నివాసానికి వెళ్లిన రాయచోటి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పోసానిని అనంతపురం తరలిస్తున్నట్లు సమాచారం.

పోసాని కృష్ణమురళిపై పలు పోలీస్ స్టేషన్లల్లో కేసులు నమోదయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రియాశీలకంగా ఉన్న పోసానీ. ఇటీవలనే రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో ఆయన. చంద్రబాబు, పవన్ తో పాటు పలువురు నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ క్రమంలో. పలువురు టీడీపీ నేతలు పోసానీపై పలు స్టేషన్లలో ఫిర్యాదులు కూడా ఇచ్చారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను దూషించిన కేసులో పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పోసాని అరెస్ట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది.

Published by HT Digital Conte...