భారతదేశం, మార్చి 8 -- Posani Krishna Murali : సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి విజయవాడ కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ విజయవాడ సీఎంఎం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ పోసానిని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని, ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలకు తిప్పుతున్నాని కోర్టులో ఆవేదన వ్యక్తం చేశారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని న్యాయమూర్తి ముందు గోడు వెల్లబోసుకున్నారు. తనకు గుండె సమస్యలు, పక్షవాతం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. తనకు జరిగిన ఆపరేషన్ల గురించి న్యాయమూర్తికి వివరించారు.

కర్నూలు జిల్లా జైలులో ఉన్న పోసాని కృష్ణ మురళిని పీటీ వారెంట్‌పై విజయవాడ భవానీపురం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు పోలీసులు. వైద్యపరీక్షల అనంతరం విజయవాడ కోర్టులో హాజరుపర్చారు. సీఎం చం...