భారతదేశం, మార్చి 22 -- గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదలయ్యారు. బెయిల్‌ మంజూరు కావడంతో.. పోసాని కృష్ణమురళిని అధికారులు విడుదల చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు సహా కేసులో.. ఆయన నిందితుడిగా ఉన్నారు. గత నెల 26న ఏపీ పోలీసులు పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు.

పోసాని కృష్ణమురళి కి బెయిల్ మంజూరు చేస్తూ.. గుంటూరు కోర్టు కండిషన్స్ పెట్టింది. కేసు గురించి బహిరంగంగా మాట్లావద్దని సూచించింది. రూ. 2 లక్షల విలువతో ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు ఇవ్వాలని స్పష్టం చేసింది. జైలు నుంచి విడుదలైన తర్వాత దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. కేసు గురించి ఎక్కడా బహిరంగంగా.. మీడియాతో కూడా మాట్లాడకూడదని షరతులు విధించింది. పత్రికలకు ప్రకటనలు ఇవ్వొద్దని, నాలుగు వారాల పాటు ప్రతి మంగళ, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు మంగ...