భారతదేశం, మార్చి 1 -- Posani Krishna Murali : కడప జిల్లా రాజంపేట సబ్ జైల్ లో ఉన్న వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి కడుపు నొప్పి అంటూ నాటకం ఆడారని రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన అడిగిన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించామని, ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు ధ్రువీకరించారన్నారు.

"పోసానిని అరెస్టు చేసి రాజంపేట సబ్ జైలుకు తరలించాం. ఈ రోజు ఉదయం తనకు కడుపులో నొప్పిగా ఉందని చెప్పారు. ఆయనను రాజంపేట ప్రభుత్వం తరలించి వైద్య పరీక్షలు చేయించాము. అనంతరం కడప రిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చాం. అక్కడ వైద్యులు అన్ని వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో అతడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశారని చెప్పారు.

పోసానికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు, పూర్తిగా ఫిట్ గా ఉన్నారు. హార్ట్ కు సంబంధించిన ఈసీజీ, రక్తపరీక్షలు, కడు...