ఆంధ్రప్రదేశ్,విశాఖపట్నం జిల్లా, జనవరి 23 -- ైట్ఏ పీలోని ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని గిరిజనులకు శుభవార్త వచ్చేసింది. అరకు కేంద్రంగా పాస్ పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభమైంది. ఫలితంగా ప్రతి రోజూ 40 నుంచి 50 మధ్య స్లాట్‌లు అందుబాటులోకి వచ్చాయి. నేటి నుంచే పాస్‌పోర్ట్‌ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కూడా అధికారులు కల్పించారు.

ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఈ కేంద్రం. అరకు లోయలోని బ్రాంచి పోస్టాఫీస్‌ ఆవరణలో ఉంది. ఈ కేంద్రం ఏర్పాటుతో ఏజెన్సీ ఏరియాలో పాస్ పోర్టు సేవలు కూడా అందుబాటులోకి వచ్చినట్లు అయింది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అల్లూరి జిల్లా వాసులు గతంలో పాస్‌పోర్టు కావాలంటే దాదాపు 120 కిలోమీటర్ల దూరంలోని విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అయితే తాజాగా అరకు కేంద్రంగా పాస్ పోర్టు ...