Hyderabad, జనవరి 28 -- తెలుగిళ్లల్లో పండగ వచ్చిందంటే పూర్ణం బూరెలు ఉండాల్సిందే. వీటి పేరు చెబితేనే నోరూరిపోతుంది. కానీ వీటిని వండడం అందరికీ రాదు. కొంతమందికి నూనెలో వేయిస్తున్నప్పుడే పూర్ణం బయటికి వచ్చి విచ్చిపోయినట్టు అవుతుంది. అందుకే పూర్ణం బూరెలు పర్‌ఫెక్ట్‌గా రావాలంటే పూర్ణం బయటికి రాకుండా ఉండాలంటే చిట్కాలు తెలుసుకోండి. ఇక్కడ మేము పూర్ణం బూరెల రెసిపి ఇచ్చాము. మేము ఇక్కడ చెప్పిన పద్ధతిలో వండితే మీకు బూరే నుండి పూర్ణం బయటికి రాకుండా పర్ఫెక్ట్ గా, టేస్టీగా పూర్ణం బూరెలు వస్తాయి. పర్ఫెక్ట్ గా సరైన కొలతలతో పూర్ణం బూరెలు వండితే అవి చాలా రుచిగా క్రిస్పీగా వస్తాయి.

మినప్పప్పు - ఒక కప్పు

బియ్యం -ఒకటింపావు కప్పు

పచ్చిశనగపప్పు - ఒక కప్పు

బెల్లం - ఒక కప్పు

యాలకుల పొడి - అర స్పూను

ఉప్పు - చిటికెడు

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

వంటసోడా -...