Hyderabad, ఫిబ్రవరి 15 -- VV Vinayak Suresh Reddy Kovvuri About Poorna Dark Night: టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో P19 ట్రాన్స్‌మీడియా స్టూడియోస్ పతాకంపై పటోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం "డార్క్ నైట్". ఈ సినిమాకు జీఆర్ ఆదిత్య దర్శకత్వం వహించారు.

పూర్ణకు జోడీగా కథ, వీకెండ్ లవ్, పివిఎస్ గరుడవేగా, 24 కిస్సెస్, కథ కంచికి మనం ఇంటికి, ప్రేమదేశం, మనమే వంటి చిత్రాలలో నటించిన త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) నటించగా విధార్థ్, బిగ్ బాస్ బ్యూటి శుభశ్రీ రాయగురు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రస్తుతం సెన్సార్‌కి డార్క్ నైట్ మూవీ రెడీగా ఉంది.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా డార్క్ నైట్ మూవీ టీజర్‌ను దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్ట...