భారతదేశం, ఏప్రిల్ 18 -- Pooja Hegde: పూజాహెగ్డే ప్రేమ‌లో ప‌డ్డ‌ట్లు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటోన్న ఈ బ్యూటీ ప్రియుడితో రొమాన్స్‌లో మునిగితేలుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. హిందీ బిగ్‌బాస్ సీజ‌న్ 10 ఫేమ్‌, సీరియ‌ల్ యాక్ట‌ర్ రోహ‌న్ మెహ్ర‌తో పూజాహెగ్డేడేటింగ్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

గ‌త కొన్నాళ్లుగా పూజాహెగ్డే ఎక్క‌డ క‌నిపిస్తే అక్క‌డ ఆమె వెంట రోహ‌న్ మెహ్ర కూడా ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. బుధ‌వారం పూజాహెగ్డే త‌న ఫ్యామిలీతో క‌లిసి ముంబైలోని ఓ రెస్టారెంట్‌కు వ‌చ్చింది. పూజాహెగ్డే ఫ్యామిలీతో పాటు రోహ‌న్ మెహ్ర కూడా రెస్టారెంట్‌లో క‌నిపించాడు. పూజాహెగ్డే ఫ్యామిలీతో క‌లిసి రోహ‌న్ మెహ్ర‌ ఫోటోల‌కు ఫోజిచ్చాడు. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

రోహ‌న్‌తో పూజాహెగ్డే డే...