Hyderabad, ఫిబ్రవరి 4 -- Pooja Hegde: అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో మూవీ ఎంత పెద్ద హిట్టో తెలుసు కదా. సంక్రాంతి సినిమాగా వచ్చి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మూవీ ఇది. ఇందుల్లో అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది. కానీ ఇదో తెలుగు సినిమా అని ఆమె మరచిపోయింది. ఇది తమిళ సినిమా అంటూ ఓ ఇంటర్వ్యూలో నోరు జారడంతో ట్రోలింగ్ జరుగుతోంది.

పూజా హెగ్డే ఈ మధ్య తెలుగు సినిమాలకు దూరమై తెలుగు వాళ్లను, మన సినిమాలను పూర్తిగా మరచిపోయినట్లుంది. అందుకే అల వైకుంఠపురంలోలాంటి హిట్ సినిమాను కూడా ఓ తమిళ సినిమా అంటూ ఆమె నోరు జారింది.

ఈ మధ్యే ఆమె హిందీలో షాహిద్ కపూర్ తో కలిసి దేవా మూవీలో నటించిన విషయం తెలుసు కదా. ఇందులో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూలో బిజీగా గడిపింది. అయితే అందులో ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా నోరు జారింది.

"అల వైకుంఠపురంలో ఓ తమిళ స...